నుపుర్ శర్మ తల తెచ్చి ఇస్తే ఆస్తులు రాసిస్తానన్న అజ్మీర్ దర్గా ఖాదిమ్ అరెస్ట్
- వైరల్ అయిన సల్మాన్ చిస్తీ వీడియో
- తల్లి మీద ప్రమాణం చేసి మరీ శపథం
- ఆమె తల తెచ్చి ఇస్తే తన ఇల్లు రాసిచ్చేస్తానని ప్రమాణం
మూడు నిమిషాల నిడివున్న ఈ వీడియోలో చిస్తీ మాట్లాడుతూ.. ‘‘నాకు జన్మనిచ్చిన తల్లి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. ఆమె (నుపుర్ శర్మ) ను బహిరంగంగా కాల్చి పారేస్తాను. నా పిల్లల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను.. ఆమెను కాల్చి చంపడం ఖాయం. అంతేకాదు, ఆమె తలను తీసుకొచ్చి ఇచ్చిన ఎవరికైనా సరే నా ఇంటిని ఇచ్చేస్తాను. ఇది సల్మాన్ శపథం’’ అని పేర్కొన్నాడు.
ఈ వీడియో వైరల్ అయిన వెంటనే పోలీసులు స్పందించారు. అజ్మీర్‌లోని అల్వార్ గేట్ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది. ఆ వీడియోలో చిస్తీ తాగిన మత్తులో ఉన్నట్టు అజ్మీర్ ఏఎస్పీ వికాస్ సంగ్వాన్ తెలిపారు. కాగా, గత రాత్రి చిస్తీని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు.