సోనియా గాంధీ పుస్తకానికి కొత్త పబ్లిషర్.. నవంబర్ 10న విడుదల
- సోనియా గాంధీ పుస్తకానికి కొత్త పబ్లిషర్‌గా హార్పర్‌కాలిన్స్
- నవంబర్ 10న భారత్‌లో ‘బిలాంగింగ్’ విడుదల
- పెంగ్విన్ ప్రచురణపై వచ్చిన వార్తలను సంస్థ ఖండన
- పుస్తకంలో సోనియా వ్యక్తిగత, రాజకీయ ప్రయాణం
- ఇందిర, రాజీవ్ గాంధీ హత్యల ప్రభావాన్ని ప్రస్తావించిన సోనియా
సోనియా గాంధీ రాసిన ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకానికి భారత్‌లో కొత్త ప్రచురణకర్త ఖరారైంది. ‘హార్పర్‌కాలిన్స్ ఇండియా’ ఈ పుస్తకాన్ని ప్రచురించనుంది. 2026 నవంబర్ 10న భారత్‌లో పుస్తకం విడుదల కానుంది.
ఈ విషయాన్ని ‘హార్పర్‌కాలిన్స్ ఇండియా’ శుక్రవారం ప్రకటించింది. అత్యంత ఆసక్తి రేపుతున్న రాజకీయ జ్ఞాపకాల పుస్తకాల్లో ఇదొకటని తెలిపింది. ప్రేమ, గుర్తింపు, బాధ్యత, అనుబంధం వంటి అంశాల చుట్టూ సోనియా గాంధీ వ్యక్తిగత జీవితాన్ని ఇందులో వివరించినట్లు పేర్కొంది.
ఇటీవల సోనియా గాంధీ పుస్తకానికి పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా ప్రచురణకర్త కాదని ప్రకటించింది. పుస్తకంలోని కొన్ని అంశాలపై రచయితతో చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడిందని సంస్థ తెలిపింది. అయితే సంపాదకీయ మార్పులకు సోనియా గాంధీ అంగీకరించకపోవడంతోనే పుస్తక ప్రచురణ నుంచి తప్పుకున్నారన్న వార్తలను పెంగ్విన్ ఖండించింది. బాహ్య ఒత్తిడి కారణం కాదని స్పష్టం చేసింది.
‘బిలాంగింగ్’ పుస్తకాన్ని అమెరికాకు చెందిన ఆల్ఫ్రెడ్ ఏ.నాఫ్ నవంబర్ 10న విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించింది. భారత్‌లో మాత్రం ప్రచురణ బాధ్యతలు ఇప్పుడు ‘హార్పర్‌కాలిన్స్ ఇండియా’కు దక్కాయి.
ఈ పుస్తకంలో సోనియా గాంధీ తన ఆరు దశాబ్దాల అనుభవాలను ప్రస్తావించారు. 1984లో అత్త ఇందిరా గాంధీ హత్యతో తన జీవితం ఎలా మారిందో వివరించారు. 1991లో భర్త రాజీవ్ గాంధీ హత్య తర్వాత ఎదురైన పరిస్థితులనూ పంచుకున్నారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తీరాన్ని పుస్తకంలో ప్రస్తావించారు.
కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సుదీర్ఘకాలం కొనసాగిన సోనియా గాంధీ.. ప్రధానమంత్రి పదవిని చేపట్టే అవకాశం వచ్చినా తిరస్కరించారు. 2014లో కాంగ్రెస్ అధికారం కోల్పోయి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భాజపా అధికారంలోకి వచ్చిన పరిణామాలనూ ఆమె తన పుస్తకంలో ప్రస్తావించారు.