England: బర్మింగ్ హామ్ టెస్టులో పోరాడుతున్న ఇంగ్లండ్... లంచ్ విరామానికి 200/6

  • బర్మింగ్ హామ్ లో టీమిండియా, ఇంగ్లండ్ టెస్టు
  • తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 416 ఆలౌట్
  • ఆసక్తికరంగా సాగుతున్న టెస్టు
  • సెంచరీకి చేరువలో బెయిర్ స్టో
England reach 200 mark in Birmingham test

బర్మింగ్ హామ్ లో టీమిండియాతో జరుగుతున్న టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ పోరాడుతోంది. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 416 పరుగులు చేయగా, మూడో రోజు ఆటలో లంచ్ విరామానికి ఇంగ్లండ్ 6 వికెట్లకు 200 పరుగులు చేసింది. తొలి సెషన్ లో బెయిర్ స్టో ఆటే హైలైట్. 

ప్రస్తుతం బెయిర్ స్టో 91 పరుగులతో ఆడుతున్నాడు. 113 బంతులు ఎదుర్కొన్న బెయిర్ స్టో 12 ఫోర్లు, 2 సిక్సులు కొట్టాడు. అతడికి జోడీగా శామ్ బిల్లింగ్స్ 7 పరుగులతో క్రీజులో ఉన్నాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంగ్లండ్ ఇంకా 216 పరుగులు వెనుకబడి ఉంది.

More Telugu News