Ravindra Jadeja: బర్మింగ్ హామ్ టెస్టులో సెంచరీ పూర్తి చేసుకున్న జడేజా

Jadeja completes century in Birmingham test
షార్ట్స్‌లో చూడండి
ఇంగ్లండ్ తో బర్మింగ్ హామ్ లో జరుగుతున్న టెస్టులో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అద్భుతంగా ఆడి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్లిష్ట పరిస్థితుల్లో ఎంతో సంయమనంతో ఆడిన జడేజా 183 బంతుల్లో 100 పరుగులు సాధించాడు. అతడి స్కోరులో 13 బౌండరీలు ఉన్నాయి. రెండో రోజు ఆట ఆరంభంలోనే జడేజా ఈ ఘనత అందుకున్నాడు. 

తొలిరోజు ఆటలో సెంచరీ హీరో రిషబ్ పంత్ కు విశేషంగా సహకారం అందించిన జడేజా... కెరీర్ లో చిరస్మరణీయం అనదగ్గ శతకాన్ని లిఖించాడు. మాథ్యూ పాట్స్ బౌలింగ్ లో వరుసగా రెండు ఫోర్లు కొట్టి సెంచరీ మార్కు అందుకున్నాడు. ప్రస్తుతం టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరు 8 వికెట్లకు 371 పరుగులు. 16 పరుగులు చేసిన మహ్మద్ షమీ... బ్రాడ్ బౌలింగ్ లో అవుటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో జడేజా (100 బ్యాటింగ్), టీమిండియా సారథి బుమ్రా ఉన్నారు.
Go Back to Shorts
Ravindra Jadeja
Century
Team India
England
Birmingham

More Telugu News