తెలంగాణలో 4 వేలు దాటిన కరోనా యాక్టివ్ కేసులు

Telangana corona media report
  • ప్రస్తుతం రాష్ట్రంలో 4,172 యాక్టివ్ కేసులు
  • గత 24 గంటల్లో 26,126 కరోనా పరీక్షలు
  • 459 మందికి పాజిటివ్
  • హైదరాబాదులో 232 కొత్త కేసులు
తెలంగాణలో కరోనా వ్యాప్తి మళ్లీ ఊపందుకుంటోంది. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4 వేలు దాటింది. ప్రస్తుతం తెలంగాణలో 4,172 మంది చికిత్స పొందుతున్నారు. గడచిన 24 గంటల్లో 26,126 కరోనా పరీక్షలు నిర్వహించగా, 459 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. 

అత్యధికంగా హైదరాబాదు జిల్లాలో 232 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 60, సంగారెడ్డి జిల్లాలో 54, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 28 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 247 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటిదాకా 7,99,991 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,91,708 మంది ఆరోగ్యవంతులయ్యారు. కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.
Go Back to Shorts
Telangana
Corona Virus
Daily Report
Active Cases

More Telugu News