'సలార్' కోసం యాక్షన్ ఎపిసోడ్ తో బిజీగా ఉన్న ప్రభాస్!
- హైదరాబాదులో షూటింగు జరుపుకుంటున్న 'సలార్'
- ప్రభాస్ తదితరులపై యాక్షన్ సీన్స్ చిత్రీకరణ
- డిఫరెంట్ గా డిజైన్ చేయించిన ప్రశాంత్ నీల్
- కథానాయికగా సందడి చేయనున్న శ్రుతి హాసన్
ఇక ఇప్పుడు మళ్లీ ఈ సినిమా తాజా షెడ్యూల్ మొదలైంది. హైదరాబాద్ .. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ షెడ్యూల్ మొదలైంది. ప్రభాస్ .. శ్రుతి హాసన్ తదితరులపై యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు. డిఫరెంట్ గా డిజైన్ చేయబడిన ఈ యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.
ప్రశాంత్ నీల్ నుంచి ఇటీవల వచ్చిన 'కేజీఎఫ్ 2' సంచలన విజయాన్ని సాధించడంతో, సహజంగానే 'సలార్' పై అంచనాలు పెరిగిపోయాయి. ఆ అంచనాలను ఈ సినిమా ఏ మేరకు అందుకుంటుందో చూడాలి మరి. ఇక శ్రుతి హాసన్ ఈ సినిమాతో పాటు, బాలకృష్ణ - గోపీచంద్ మలినేని సినిమాలోనూ చేస్తున్న సంగతి తెలిసిందే.