USA: బహిరంగ ప్రదేశాల్లో తుపాకులు కలిగి ఉండే హక్కు ప్రజలకు ఉంది: అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పు

  • అమెరికాలో ఇటీవల పలు రాష్ట్రాల్లో తుపాకి కాల్పులు
  • తుపాకి సంస్కృతికి అడ్డుకట్ట వేసేలా చట్టం తీసుకొచ్చే పనిలో బైడెన్ సర్కారు
  • పౌరులు బహిరంగంగా తుపాకులు కలిగి ఉండడం వారి హక్కు అన్న కోర్టు
  • 6-3 మెజారిటీతో తీర్పు వెలువరించిన కోర్టు
US supreme Court delivers Sensational Verdict on Gun Culture

అమెరికా ఇటీవల తుపాకుల కాల్పులతో మోతెక్కిపోయింది. పలు రాష్ట్రాల్లో జరిగిన ఘటనల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో అమెరికా తుపాకి సంస్కృతిపై చర్చ మొదలైంది. తుపాకులను నిషేధించాలన్న డిమాండ్ కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆ దేశ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మరోమారు చర్చనీయాంశమైంది. బహిరంగంగా తుపాకులు కలిగి ఉండడం అమెరికన్ల హక్కని కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.

6-3 మెజారిటీతో న్యాయమూర్తులు ఈ తీర్పును వెలువరించారు. న్యూయార్క్, లాస్‌ఏంజెలెస్, బోస్టన్ తదితర పెద్ద నగరాలు సహా అన్ని ప్రాంతాల్లోనూ పౌరులు తమ వెంట తుపాకులు తీసుకెళ్లొచ్చని, వ్యక్తిగత రక్షణకు బహిరంగంగా తుపాకి కలిగి ఉండడం ఓ వ్యక్తి హక్కు అని జస్టిస్ క్లారెన్స్ థామస్ తన తీర్పులో రాసుకొచ్చారు. 

ఈ సందర్భంగా న్యూయార్క్ గతంలో చేసిన చట్టాన్ని కోర్టు కొట్టివేసింది. తుపాకి సంస్కృతికి అడ్డుకట్ట వేసేలా ఓ చట్టాన్ని తీసుకురావాలని యోచిస్తున్న బైడెన్ సర్కారు సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందన్న ఆసక్తి మొదలైంది.

More Telugu News