Raviteja: 'రామారావు ఆన్ డ్యూటీ' రిలీజ్ డేట్ ఖరారు!

  • విభిన్నమైన కథాకథనాలతో  రూపొందిన 'రామారావు ఆన్ డ్యూటీ'
  • రవితేజ సరసన మెరవనున్న ఇద్దరు కథానాయికలు
  • ఈ సినిమాతో రీ ఎంట్రీ  ఇస్తున్న వేణు తొట్టెంపూడి 
  • వచ్చేనెల 29వ తేదీన సినిమా విడుదల
Ramarao On Duty  releasae date confirmed

రవితేజ కథానాయకుడిగా సుధాకర్ చెరుకూరి 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాను నిర్మించారు. ఈ సినిమాతో శరత్ మండవ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. 'మజిలీ' ఫేమ్ దివ్యాన్ష కథానాయికగా నటించగా, మరో కథానాయికగా రజీషా విజయన్ అలరించనుంది. ఈ సినిమాను ఈ నెల 17వ తేదీన విడుదల చేయాలనుకున్నారుగానీ కుదరలేదు.  

కొంతసేపటి క్రితం కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. వచ్చేనెల 29వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు చెబుతూ అధికారిక పోస్టర్ ను వదిలారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన వేణు తొట్టెంపూడి ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఆయన పాత్ర చాలా కీలకమైనదని అంటున్నారు. 

 ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన అప్ డేట్స్ ఆసక్తిని పెంచుతూ వచ్చాయి. సామ్ సీఎస్ స్వరపరిచిన పాటలు కూడా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకంతో రవితేజ ఉన్నాడు. నాజర్ .. నరేశ్ .. రాహుల్ రామకృష్ణ ముఖ్యమైన పాత్రలను పోషించారు.

More Telugu News