కాల్పుల్లో మృతి చెందిన రాకేశ్ మృతదేహంతో భారీ ర్యాలీకి సిద్ధమైన టీఆర్ఎస్
- వరంగల్ ఎంజీఎం నుంచి నర్సంపేటకు మృతదేహం తరలింపు
- ఎంజీఎం వద్ద భారీ పోలీసు బందోబస్తు
- నేడు నర్సంపేట నియోజకవర్గ బంద్‌కు పిలుపునిచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే
ఈ క్రమంలో అంతకంటే ముందు రాకేశ్ మృతదేహంతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించేందుకు టీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యాయి. అలాగే, రాకేశ్ మృతిని నిరసిస్తూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి నేడు నర్సంపేట నియోజకవర్గం బంద్‌కు పిలుపునిచ్చారు. మరోవైపు, వరంగల్ ఎంజీఎంలో ఉన్న రాకేశ్ మృతదేహాన్ని నేడు నర్సంపేట తరలించనున్న నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా ఆసుపత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.