'కార్తికేయ' దర్శకుడితో నిఖిల్ మూడో సినిమా!
- వరుస సినిమాలతో బిజీగా ఉన్న నిఖిల్
- వచ్చే నెల 22వ తేదీన 'కార్తికేయ 2' విడుదల
- సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానున్న '18 పేజెస్'
- వచ్చే ఏడాది ఆరంభంలో పలకరించనున్న 'స్పై'
ఇక ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా రూపొందనుందని అంటున్నారు. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పై గట్టిగానే కసరత్తు జరుగుతోందని చెబుతున్నారు. ప్రస్తుతం నిఖిల్ ఒప్పుకున్న ప్రాజెక్టులు పూర్తయిన తరువాత ఈ సినిమా పట్టాలపైకి వెళ్లనుందని అంటున్నారు.
నిఖిల్ నుంచి 'కార్తికేయ 2' తరువాత '18 పేజెస్' రానుంది. గీతా ఆర్ట్స్ 2 పై నిర్మితమైన ఈ సినిమాను సెప్టెంబర్లో విడుదల చేయనున్నారు. ఆ తరువాత సినిమాగా 'స్పై' లైన్లోనే ఉంది. గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్స్ ఆసక్తిని పెంచుతున్నాయి.