Ram Gopal Varma: జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనపై రామ్ గోపాల్ వర్మ స్పందన

  • కారులో మైనర్ బాలికపై అత్యాచారం
  • నిందితులకు శిక్ష పడాలంటూ ఎలుగెత్తిన ఎమ్మెల్యే రఘునందన్
  • రఘునందన్ ఒక్కరే నిజాయతీగా ఉన్నారన్న వర్మ
  • మిగతావాళ్లు తప్పుదోవపట్టిస్తున్నారని వెల్లడి
Ram Gopal Varma opines on Jubilee Hills incident

హైదరాబాదులో ఓ మైనర్ బాలికపై కారులో సామూహిక అత్యాచారం జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా ఈ ఘటనపై ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఈ వ్యవహారానికి సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఒక్కరే నిజాయతీగా వ్యవహరిస్తున్నారని అభిప్రాయపడ్డారు. మిగతా వారంతా ఈ ఘటనను తప్పుదోవపట్టించే ఎత్తుగడలకు పాల్పడుతున్నారని, ఇది బాధాకరమని పేర్కొన్నారు. ఓ సాధారణ పౌరుడిగా ఇది తన అభిప్రాయమని తెలిపారు. ఈ మేరకు వర్మ ట్వీట్ చేశారు.

More Telugu News