ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీని వెనక్కినెట్టిన అంబానీ

Mukesh Ambani reaches 8th spot in Bloomberg world rich list
రిలయన్స్ గ్రూపు షేరు విలువ రివ్వున దూసుకెళ్లడంతో ముఖేశ్ అంబానీ నికర సంపదలో పెరుగుదల చోటుచేసుకుంది. వరల్డ్ బిలియనీర్స్ జాబితాలో అంబానీ 8వ స్థానానికి ఎగబాకారు. ఈ క్రమంలో ఆయన మరో భారత కుబేరుడు గౌతమ్ అదానీని వెనక్కి నెట్టారు. అంతేకాదు, ఆసియా సంపన్నుల జాబితాలో అంబానీ అగ్రస్థానం చేజిక్కించుకున్నారు. ఈ మేరకు అంతర్జాతీయ సంస్థ బ్లూమ్ బెర్గ్ పేర్కొంది. 

ఈ జాబితాలో అంబానీ 8వ స్థానంలో ఉండగా, అదానీ 9వ స్థానంలో నిలిచారు. ఎప్పట్లాగానే టెస్లా అధినేత ఎలాన్ మస్క్ 227.5 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే నెంబర్ వన్ కుబేరుడిగా కొనసాగుతున్నారు.

బ్లూమ్ బెర్గ్ టాప్-10 జాబితా...

1. ఎలాన్ మస్క్- 227.5 బిలియన్ డాలర్లు
2. జెఫ్ బెజోస్- 149.4 బిలియన్ డాలర్లు
3. బెర్నార్డ్ ఆర్నాల్ట్- 138.3 బిలియన్ డాలర్లు
4. బిల్ గేట్స్- 123.6 బిలియన్ డాలర్లు
5. వారెన్ బఫెట్- 114.1 బిలియన్ డాలర్లు
6. లారీ పేజ్- 106.4 బిలియన్ డాలర్లు
7. సెర్గీ బ్రిన్- 101.9 బిలియన్ డాలర్లు
8. ముఖేశ్ అంబానీ- 99.7 బిలియన్ డాలర్లు
9. గౌతమ్ అదానీ- 98.7 బిలియన్ డాలర్లు
10. స్టీవ్ బామర్- 96.8 బిలియన్ డాలర్లు
Go Back to Shorts
Mukesh Ambani
Rich List
Gautam Adani
Bloomberg
India

More Telugu News