India: ఇండియా కరోనా అప్డేట్స్!

India corona updates
షార్ట్స్‌లో చూడండి
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నిలకడగా కొనసాగుతోంది. నిన్న కూడా కొత్త కేసులు 3 వేలకు దిగువనే నమోదయ్యాయి. గత 24 గంటల్లో 4.72 లక్షల మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా... 2,897 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 2,986 మంది కరోనా నుంచి కోలుకోగా... 54 మంది ప్రాణాలు కోల్పోయారు. 

తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,31,10,586కి చేరుకుంది. ఇప్పటి వరకు 4,25,66,935 మంది కోలుకోగా... 5,24,157 మంది మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 19,494 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.74 శాతంగా ఉండగా... క్రియాశీల రేటు 0.05 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 190 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. నిన్న ఒక్కరోజే 14.8 లక్షల మంది టీకా వేయించుకున్నారు.
Go Back to Shorts
India
Corona Virus
Updates

More Telugu News