Sarkaru Vaari Paata: సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న 'సర్కారు వారి పాట'

Sarkaaru Vaari Paata completes censor works
షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం సర్కారు వారి పాట. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తాజా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చింది. కాగా, ఈ సినిమా నిడివి 162 నిమిషాల 25 సెకన్లు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో వెల్లడించింది. 

సర్కారు వారి పాట చిత్రం ఈ నెల 12న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. నిన్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాదులో ఘనంగా నిర్వహించారు. ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే విశేష ప్రజాదరణ పొందాయి. తమన్ మ్యూజిక్ కు మహేశ్ అభిమానుల నుంచి భారీ స్పందన వస్తోంది. కళావతి, పెన్నీ పాటలు సోషల్ మీడియాను ఊపేయడం తెలిసిందే.
Go Back to Shorts
Sarkaru Vaari Paata
Censor
U/A
Mahesh Babu
Keerthy Suresh
Tollywood

More Telugu News