నేపాల్ నైట్ క్లబ్ లో రాహుల్ గాంధీ.. పక్కనున్న మహిళ ఎవరంటూ పెద్ద చర్చ.. వీడియో ఇదిగో!

Rahul Gandhi in Nepal night club
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేపాల్ నైట్ క్లబ్ లో ఉన్న వీడియో ఇప్పడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఈ ఉదయం నెట్ లో వీడియో ప్రత్యక్షం అయిన వెంటనే.. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో రాహుల్ పక్కన ఒక మహిళ కనిపిస్తున్నారు. 

నేపాల్ లోని ఖాట్మండూ నైట్ క్లబ్ లో రాహుల్ గడిపినట్టు తెలుస్తోంది. పక్కనున్న మహిళ ఎవరనే విషయంపై పెద్ద చర్చే జరుగుతోంది. ఆమె నేపాల్ లోని చైనా అంబాసడర్ అని కొందరు అంటున్నారు. ఆమెతో కలిసి రాహుల్ పార్టీ చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. రాహుల్ నేపాల్ లో ఉన్నట్టు ఖాట్మండు పోస్ట్ ఓ కథనాన్ని ప్రచురించింది. 

మరోవైపు, మయన్మార్ లో నేపాల్ రాయబారిగా పని చేసిన భీమ్ ఉదాస్ తన కుమార్తె వివాహానికి రాహుల్ ను ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఆ వివాహానికి హాజరయ్యేందుకు ఆయన నేపాల్ కు వెళ్లారని కొందరు చెపుతున్నారు. 

ఇంకోవైపు, ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసిన బీజేపీ జాతీయ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాళవీయ... రాహుల్ పై విమర్శలు గుప్పించారు. సొంత పార్టీలో రచ్చ జరుగుతుంటే రాహుల్ మాత్రం నైట్ క్లబ్ లో ఉన్నారని ఎద్దేవా చేశారు.
Go Back to Shorts
Rahul Gandhi
Night Club
Nepal
Congress
BJP

More Telugu News