India: ఇండియాలో పెరుగుతున్న కరోనా కేసులు... అప్డేట్స్ ఇవిగో!

India corona updates
షార్ట్స్‌లో చూడండి
ఇండియాలో కరోనా కేసులు రోజురోజుకు క్రమంగా పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా రోజువారీ కేసులు 3 వేలకు పైగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 3,688 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 1,607 కేసులు ఢిల్లీలోనే ఉండటం గమనార్హం. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా 2,755 మంది కరోనా నుంచి కోలుకోగా... 50 మంది చనిపోయారు. 

తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,30,75,864కి చేరుకుంది. ఇప్పటి వరకు 4,25,33,377 మంది కోలుకోగా... 5,23,803 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 18,684 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 0.74 శాతానికి పెరిగింది. రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 1,88,89,90,935 డోసుల కరోనా వ్యాక్సిన్ వేశారు. నిన్న ఒక్క రోజే 22,58,059 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.
Go Back to Shorts
India
Corona Virus
Updates

More Telugu News