పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళుతున్న 'వీరమల్లు'
- 'వకీల్ సాబ్'తో హిట్ అందుకున్న పవన్
- 'భీమ్లా నాయక్'తోను లభించిన సక్సెస్
- 'వీరమల్లు'తో హ్యాట్రిక్ హిట్ కొట్టాలనేది ఫ్యాన్స్ కోరిక
- ఇప్పటికే 50 శాతం షూటింగును పూర్తిచేసిన క్రిష్
ఇక మే 2వ వారం నుంచి మరో షెడ్యూల్ ను ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. పవన్ తో పాటు ఇతర ముఖ్య తారాగణం ఆ షెడ్యూల్లో పాల్గొననున్నట్టు చెబుతున్నారు. జూన్ నెలతో ఈ సినిమా షూటింగు పార్టును పూర్తిచేసేలా ప్రణాళిక రచన చేశారట. నిధి అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, అర్జున్ రాంపాల్ ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు.
పవన్ రీ ఎంట్రీ తరువాత చేస్తున్న 3వ సినిమా ఇది. 'వకీల్ సాబ్' .. 'భీమ్లా నాయక్' ఈ రెండు సినిమాలు కూడా భారీ విజయాలను అందుకున్నాయి. 'వీరమల్లు'తో పవన్ హ్యాట్రిక్ హిట్ అందుకోవాలని అభిమానులంతా భావిస్తున్నారు. ఈ సినిమా తరువాత 'భవదీయుడు భగత్ సింగ్' కోసం పవన్ సెట్స్ పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే.