విజయవాడ అత్యాచార బాధితురాలి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం జగన్
- విజయవాడలో ఘోరం
- మానసిక వికలాంగురాలిపై అత్యాచారం
- ఎవరినీ ఉపేక్షించవద్దన్న సీఎం
- ఇద్దరు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు
యువతి మూడ్రోజుల క్రితం ఇంటినుంచి వెళ్లిపోగా, తల్లిదండ్రుల ఫిర్యాదు పట్ల పోలీసులు సరిగా స్పందించలేదన్న ఆరోపణలు వచ్చాయి. చివరికి బాధితురాలిని తల్లిదండ్రులే ప్రభుత్వాసుపత్రి వద్ద గుర్తించిన వైనం పోలీసుల నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమంటూ తీవ్ర విమర్శలు వస్తున్నాయి.