Budda Venkanna: 100 మందితో సూసైడ్ బ్యాచ్ తయారు చేశాం: బుద్ధా వెంకన్న

We prepared suicide batch says Budda Venkanna
  • వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలన్న వెంకన్న 
  • చంద్రబాబుపై చెత్త వాగుడు వాగితే చంపడానికైనా, చావడానికైనా సిద్ధమని వెల్లడి 
  • చంద్రబాబును తిడితే మంత్రి పదవులు వస్తాయనే భ్రమల్లో నుంచి బయటకు రావాలని సూచన 

వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న హెచ్చరించారు. తమ అధినేత చంద్రబాబుపై చెత్త వాగుడు వాగితే చంపడానికైనా, చావడానికైనా తాము సిద్ధమేనని చెప్పారు. వంద మందితో సూసైడ్ బ్యాచ్ ని తయారు చేశామని అన్నారు. చంద్రబాబు జోలికి కానీ, ఆయన కుటుంబం జోలికి గానీ వస్తే ఎంతకైనా తెగిస్తామని చెప్పారు. చంద్రబాబును తిడితేనో, టీడీపీ ఆఫీసులపై దాడి చేస్తేనో పదవులు వస్తాయనే భ్రమల్లో నుంచి బయటకు రావాలని చెప్పారు. సీనియర్ నేతలను కాదని జోగి రమేశ్ కు మంత్రి పదవి ఎలా వచ్చిందని వెంకన్న ప్రశ్నించారు.
Budda Venkanna
Chandrababu
Telugudesam
Jogi Ramesh
YSRCP

More Telugu News