Anil Kumar Yadav: ఆనంకు కౌంట‌ర్ ఇచ్చిన అనిల్ కుమార్ యాద‌వ్‌!

anil kumar counters to anam ramanarayana reddy
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో మంత్రివ‌ర్గ పునర్వ్య‌వస్థీక‌ర‌ణ త‌ర్వాత వైసీపీ నేత‌ల మ‌ధ్య అభిప్రాయ భేదాలు బ‌య‌ట‌ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ శాఖ‌లో తాజా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్‌, కొత్త‌గా మంత్రి ప‌ద‌వి చేప‌ట్టిన కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డిల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. 

ఇందులో భాగంగా ఆదివారం జ‌రిగిన మంత్రి అభినంద‌న స‌భ‌లో పాలుపంచుకున్న పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి.. మూడేళ్లుగా జిల్లాలో ఇరిగేష‌న్‌కు సంబంధించి ఆశించిన మేర అభివృద్ధి జ‌ర‌గ‌లేదంటూ వ్యాఖ్యానించారు. ఆనం వ్యాఖ్య‌ల‌కు తాజాగా అనిల్ కుమార్ యాద‌వ్ కౌంట‌ర్ ఇచ్చారు. రోజుకో పార్టీ మారే వారి గురించి తానేమీ మాట్లాడ‌బోన‌న్న అనిల్ కుమార్‌... త‌న‌కు ఓ పార్టీ లైన్ అంటూ ఉంద‌ని వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Anil Kumar Yadav
Anam Ramanarayana Reddy
YSRCP
Nellore District

More Telugu News