Telangana: అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కుమార్తె ఆత్మహత్య

aswaraopet former mla thati venkateswarlu daughter commits suicide
  • ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న టీఆర్ఎస్ నేత కుమార్తె
  • ఎంబీబీఎస్ పూర్తిచేసి ప్రస్తుతం పీజీకి సన్నద్ధమవుతున్న మహాలక్ష్మి
  • గుండెలవిసేలా రోదించిన వెంకటేశ్వర్లు
టీఆర్ఎస్ నేత, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కుమార్తె తాటి మహాలక్ష్మి నిన్న ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పొద్దెక్కినా మహాలక్ష్మి తన గది తలుపులను తెరవకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు తలుపులు పగలగొట్టి గదిలోకి వెళ్లారు.

అయితే, లోపల కనిపించిన దృశ్యం చూసి నిర్ఘాంతపోయారు. మహాలక్ష్మి గదిలో ఉరికి వేలాడుతూ కనిపించడంతో షాకయ్యారు. వెంటనే ఆమెను కిందికి దించి భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించగా, పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

విషయం తెలిసిన తాటి వెంకటేశ్వర్లు వెంటనే భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. కుమార్తె మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఎంబీబీఎస్ పూర్తి చేసిన మహాలక్ష్మి ప్రస్తుతం పీజీ కోసం సన్నద్ధమవుతున్నారు.
Telangana
TRS
Aswaraopet
Thati Venkateswarlu
Thati Mahalaxmi

More Telugu News