India: భారత్ లో వెయ్యికి దిగువకు కరోనా కేసులు.. అప్డేట్స్ ఇవిగో!

India reports 861 fresh COVID19 cases
షార్ట్స్‌లో చూడండి
మన దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. రోజువారీ నమోదవుతున్న కేసుల సంఖ్య వెయ్యికి దిగువకు చేరుకుంది. గత 24 గంటల్లో 2.7 లక్షల మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 861 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో కేవలం ఆరు మరణాలు మాత్రమే సంభవించాయి. గత 24 గంటల్లో 929 మంది కోలుకున్నారు. 

ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 11,058గా ఉంది. క్రియాశీల రేటు 0.03 శాతానికి పడిపోయింది. రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశంలో 4,25,03,383 మంది కోలుకోగా... మొత్తం 5,21,691 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు 185 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులను వేశారు. నిన్న ఒక్క రోజే 2.4 లక్షల మంది టీకా వేయించుకున్నారు.
Go Back to Shorts
India
Corona Virus
Updates

More Telugu News