విదేశాలకు పారిపోయే యోచనలో శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్స?
- శ్రీలంకలో మరింత దిగజారిన పరిస్థితులు
- రాజపక్స సోదరులపై పెల్లుబుకుతున్న ప్రజాగ్రహం
- ప్రధాని ప్రాణాలకు ముప్పు పొంచి ఉందనే వార్తలు
సాక్షాత్తు సైన్యం రంగంలోకి దిగినా జనాలు ఏ మాత్రం తగ్గడం లేదు. అధ్యక్షుడు, ప్రధాని భవనాలపై దాడి చేసేందుకు సైతం యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని ప్రాణాలకు ముప్పు పొంచి ఉందనే వార్తలు వస్తున్నాయి. మరోవైపు, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దేశాన్ని విడిచి విదేశాలకు పారిపోయే యోచనలో ప్రధాని మహీంద రాజపక్స ఉన్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది.