Sharwanand: కృతి శెట్టి కోసం అనుకున్న పాత్రలో కీర్తి సురేశ్!

Keerthi Suresh in Sharwanand movie
షార్ట్స్‌లో చూడండి
శర్వానంద్ కొంతకాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. ఇటీవల వచ్చిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' కూడా ఆయనను నిరాశ పరిచింది. ఈ నేపథ్యంలోనే కృష్ణచైతన్య దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా నిర్మితం కానుంది.

ఈ సినిమాలో శర్వానంద్ ఓ బిడ్డకి తండ్రి పాత్రలో కనిపించనున్నాడు. ఆయన సరసన నాయికగా కృతి శెట్టిని సంప్రదిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే కెరియర్ ఆరంభంలో తాను ఇలా తల్లి పాత్రలు చేయనని కృతి శెట్టి చెప్పిందట. దాంతో ఈ పాత్ర కోసం కీర్తి సురేశ్ ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది.

సాధారణంగా చెల్లి పాత్రలు .. తల్లి పాత్రలు చేయడానికి యంగ్  హీరోయిన్లు అంగీకరించరు. కానీ కీర్తి సురేశ్ ఈ తరహా పాత్రలు చేయడానికి వెనుకాడదు. ' పెంగ్విన్' సినిమాలో ఒక బిడ్డకి తల్లిగా .. 'అన్నాత్తే'లో రజనీకి చెల్లిగా కనిపించిన కీర్తి సురేశ్, శర్వానంద్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. ప్రస్తుతం ఆమె చేసిన 'సర్కారువారి పాట' విడుదలకి సిద్ధమవుతూ ఉండగా, సెట్స్ పై 'దసరా' ఉంది.
Go Back to Shorts
Sharwanand
Keerthy Suresh
Krithi Shetty

More Telugu News