India: భారత్ లో కొత్తగా 1,685 కరోనా కేసులు.. అప్డేట్స్ ఇవిగో!

India reports 1685 fresh corona cases
షార్ట్స్‌లో చూడండి
భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి కట్టడిలో ఉంది. గత కొన్ని రోజులుగా కరోనా కేసులు 2 వేలకు దిగువన నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 1,685 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 2,499 మంది కరోనా నుంచి కోలుకోగా... 83 మంది మృతి చెందారు. రోజువారీ పాజిటివిటీ రేటు 0.24 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 21,530 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 4,24,78,087 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా కారణంగా ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 5,16,755కి చేరుకుంది. ఇప్పటి వరకు 1,82,55,75,120 డోసుల వ్యాక్సిన్ వేశారు.
Go Back to Shorts
India
Corona Virus
Updates

More Telugu News