కొల్హాపూర్‌ మహాలక్ష్మి అమ్మవారి సేవ‌లో కేసీఆర్ దంప‌తులు

cm kcr visits kolhapur mahalakshmi ammavari temple
  • ఉద‌యం కొల్హాపూర్ వెళ్లిన కేసీఆర్ దంప‌తులు
  • అమ్మ‌వారికి ప్ర‌త్యేక పూజ‌లు చేసిన వైనం
  • కేసీఆర్ వెంట సంతోష్ కుమార్‌, శ్రావ‌ణ్ కుమార్‌
తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు దంప‌తులు కాసేప‌టి క్రితం మ‌హారాష్ట్ర‌లోని కొల్హాపూర్‌లో శ్రీ అంబాబాయి మ‌హాల‌క్ష్మీ అమ్మ‌వారిని ద‌ర్శించుకున్నారు. అమ్మ‌వారిని ద‌ర్శించుకునే నిమిత్తం కేసీఆర్ దంపతులు గురువారం ఉద‌యం కొల్హాపూర్ కు బ‌య‌లుదేరిన సంగ‌తి తెలిసిందే. మ‌ధ్యాహ్నం 1 గంట‌ల స‌మయంలో కొల్హాపూర్ చేరుకున్న కేసీఆర్ దంప‌తులు నేరుగా అమ్మ‌వారి ఆల‌యానికి వెళ్లారు.

సీఎం కేసీఆర్ దంప‌తుల‌కు అమ్మవారి ఆల‌యం అర్చ‌కులు ఆల‌య మ‌ర్యాద‌ల‌తో స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం ఆల‌యంలోకి వెళ్లిన కేసీఆర్ దంప‌తులు కార్వీర్ నివాసిని శ్రీ అంబాబాయి మహాలక్ష్మి అలంకార పూజలో పాల్గొన్నారు. మహాలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కేసీఆర్ దంప‌తుల వెంట టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్‌, రావుల శ్రావణ్ కుమార్, తదితరులు ఉన్నారు.
Go Back to Shorts
KCR
TRS
MP Santosh Kumar
Kolhapur

More Telugu News