వెనకడుగు వేసేదే లేదంటున్న విజయ్!
- విజయ్ తాజా చిత్రంగా 'బీస్ట్'
- కథానాయికగా పూజ హెగ్డే
- ఏప్రిల్ 14వ తేదీన విడుదల
- అదే రోజున రంగంలోకి 'కేజీఎఫ్ 2'
విజయ్ సరసన పూజ హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాను ఏప్రిల్ 14వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అయితే అదే రోజున పాన్ ఇండియా స్థాయిలో 'కేజీఎఫ్ 2' ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఉన్న హైప్ కారణంగా ఇతర భాషల్లో ఏ సినిమా పోటీకి దిగడం లేదు.
ఈ నేపథ్యంలో విజయ్ సినిమా కూడా వాయిదా పడొచ్చని అంతా అనుకున్నారు. కానీ విజయ్ మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో తన సినిమాను వాయిదా వేయడానికి లేదని తేల్చి చెప్పేశాడట. ఈ విషయంలో ఆయన కాస్త పంతానికి పోయినట్టుగానే చెప్పుకుంటున్నారు. అవసరమైతే ఒక రోజు ముందుగానే 'బీస్ట్'ను వదలమని చెప్పాడట.