Chandrababu: కేంద్ర‌మంత్రి నితిన్ గడ్క‌రీకి చంద్ర‌బాబు లేఖ‌లు

chandrababu writes letter to gadkari
షార్ట్స్‌లో చూడండి
కేంద్ర‌మంత్రి నితిన్ గడ్క‌రీకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండు లేఖలు రాశారు. కష్ణా జిల్లా బాపులపాడు మండలం వేలేరు అడ్డరోడ్డు వద్ద జాతీయ రహదారిపై నెల‌కొన్న ప‌రిస్థితుల‌ను ఆయ‌న అందులో వివ‌రించారు. అక్క‌డ‌ అండర్ పాస్‌ నిర్మించాల‌ని కోరారు.  

అది లేకపోవడంతో స్థానిక గ్రామాల రైతులు, విద్యార్థులకు కలుగుతున్న ఇబ్బందులను వివరించారు. అలాగే, నందిగామ మండలం మునగచర్ల వద్ద అండర్ పాస్ నిర్మాణంపైనా మరో లేఖలో విజ్ఞ‌ప్తి చేశారు. అక్క‌డి ప్ర‌జ‌లు ప‌డుతోన్న ఇబ్బందుల‌ను గ‌డ్క‌రీ దృష్టికి తీసుకొచ్చారు.  
Go Back to Shorts
Chandrababu
Telugudesam
YSRCP

More Telugu News