India: ఇండియాలో కొత్తగా 2,539 కరోనా కేసుల నమోదు.. అప్డేట్స్ ఇవిగో!

India reports 2539 fresh Corona cases
షార్ట్స్‌లో చూడండి
పలు దేశాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో... భారత్ లో మాత్రం పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గత 24 గంటల్లో 2,539 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 4,491 మంది కరోనా నుంచి కోలుకోగా... 60 మంది మృత్యువాత పడ్డారు.

ఇక ప్రస్తుతం దేశంలో 30,799 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 0.35 శాతంగా ఉంది. రికవరీ రేటు 98.73 శాతానికి పెరిగింది. ఇప్పటి వరకు మన దేశంలో 4,24,54,546 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మృతుల సంఖ్య 5,16,132కి పెరిగింది. ఇప్పటి వరకు 180.80 కోట్ల డోసుల వ్యాక్సిన్ వేశారు. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Go Back to Shorts
India
Corona Virus
Updates

More Telugu News