Raviteja: 'ఖిలాడి' స్ట్రీమింగ్ మొదలైపోయింది!

  • క్రితం నెల 11న థియేటర్లకి వచ్చిన 'ఖిలాడి'
  • రవితేజ సరసన మీనాక్షి - డింపుల్ 
  • డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మొదలైన స్ట్రీమింగ్  
Khiladi movie update

రవితేజ హీరోగా రమేశ్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి' సినిమా రూపొందింది. కోనేరు సత్యనారాయణ నిర్మాణంలో ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కింది. పోస్టర్స్ దగ్గర నుంచే ఈ సినిమా అందరిలో ఆసక్తిని పెంచుతూ వచ్చింది. మీనాక్షి చౌదరి .. డింపుల్ హయతి గ్లామర్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్. ఈ సినిమాకి దేవిశ్రీ స్వరాలను అందించాడు. పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. 

అలాంటి ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు సొంతం చేసుకున్నారు. ఈ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ మొదలైంది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తూ పోస్టర్ ను వదిలారు. మరి ఓటీటీ నుంచి ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను రాబడుతుందనేది చూడాలి.

  • Loading...

More Telugu News