తెలంగాణలో కొత్తగా 91 మందికి కరోనా పాజిటివ్... తాజా బులెటిన్ ఇదిగో!

Telangana corona media report
  • గత 24 గంటల్లో 24,444 కరోనా పరీక్షలు
  • హైదరాబాదులో 33 కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 184 మంది
  • ఇంకా 1,223 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 24,444 కరోనా పరీక్షలు నిర్వహించగా, 91 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో 33 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 13 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 184 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో కరోనాతో మరణాలేవీ సంభవించలేదు. 

రాష్ట్రంలో ఇప్పటివరకు 7,90,134 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,84,800 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,223 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.
.
Go Back to Shorts
Telangana
Corona Virus
Daily Report
Today Cases

More Telugu News