తెలంగాణలో కొత్తగా 241 మందికి కరోనా
- గత 24 గంటల్లో 30,978 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 76 కొత్త కేసులు
- ఇంకా 3,539 మందికి చికిత్స
అదే సమయంలో 512 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత 24 గంటల వ్యవధిలో ఎలాంటి మరణాలు సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,88,624 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,80,974 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,539 మంది చికిత్స పొందుతున్నారు.