తెలంగాణలో ఎఫ్‌డీలపై అధికారుల ఇష్టారాజ్యం చెల్లదిక: తెలంగాణ సర్కారు ఆదేశం
- ప్రభుత్వ లీడ్ బ్యాంకులోనే ఎఫ్‌డీలు చేయాలి
- బ్యాంకు ఖాతా తెరవాలన్నా సర్కారు అనుమతి తప్పనిసరి
- వాడని ఖాతాలను తక్షణమే క్లోజ్ చేయాల్సిందే
- అన్ని శాఖలకు తెలంగాణ సర్కారు ఆదేశాలు
ఈ మేరకు సోమవారం తెలంగాణ సర్కారు తన పరిధిలోని అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. అందుబాటులో ఉన్న నిధులను అవసరమైన మేరకు అట్టిపెట్టుకుని.. మిగిలిన మొత్తాలను ఎఫ్‌డీలుగా మార్చాలని, అయితే ఆ ఎఫ్‌డీలను ప్రభుత్వ లీడ్ బ్యాంకులోనే చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా ఆయా శాఖలు ఇష్టారాజ్యంగా బ్యాంకు ఖాతాలు తెరవడం కూడా ఇకపై కుదరదని, ఆయా శాఖలు బ్యాంకు ఖాతాలు తెరవాలంటే ఇకపై ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని కూడా ఓ నిబంధన పెట్టేసింది. అంతటితో ఆగకుండా.. ఆయా శాఖలకు చెందిన వాడని బ్యాంకు ఖాతాలను తక్షణమే మూసివేయాలని, ఈ వివరాలన్నింటిని అందజేయాలని కూడా తెలంగాణ సర్కారు అన్ని శాఖలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.