తెలంగాణలో మరింత తగ్గిన కరోనా వ్యాప్తి... కొత్తగా 385 పాజిటివ్ కేసులు
- గత 24 గంటల్లో 39,386 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 95 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 733 మంది
- ఇంకా 4,787 మందికి చికిత్స
అదే సమయంలో 733 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,87,063 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,78,167 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,787 మంది చికిత్స పొందుతున్నారు.
