తెలంగాణలో కొత్తగా 429 కరోనా కేసులు

Telangana corona daily report
  • గత 24 గంటల్లో 32,932 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 142 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 11,681 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 32,932 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 429 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 142 కొత్త కేసులు వెల్లడి కాగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 41, రంగారెడ్డి జిల్లాలో 33, నల్గొండ జిల్లాలో 22 కేసులు గుర్తించారు. జోగులాంగ గద్వాల్ జిల్లాలో కొత్తకేసులేవీ నమోదు కాలేదు.

అదే సమయంలో 2,421 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,83,448 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,67,660 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 11,681 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,107కి పెరిగింది.
Go Back to Shorts
Telangana
Corona Virus
Daily Report
Today Cases

More Telugu News