Pushpa: అంద‌రూ ఇలా 'పుష్ప' హీరో అల్లు అర్జున్‌ని అనుస‌రించాలంటూ ఫొటో పోస్ట్ చేసిన అధికారులు

Follow CovidAppropriateBehaviour like pushpa
షార్ట్స్‌లో చూడండి
దేశ వ్యాప్తంగా 'పుష్ప' రాజ్ మేనియా మామూలుగా లేదు. 'త‌గ్గేదే లే' అంటూ బ‌న్నీ చెప్పిన డైలాగుల‌తో ప్ర‌భుత్వ అధికారులు కూడా అనేక ప్ర‌యోగాలు చేస్తున్నారు. ఇప్ప‌టికే పుష్ప సినిమాలోని అల్లు అర్జున్ ఫొటోల‌ను వాడుకుని ట్రాఫిక్ పోలీసులు రోడ్డుపై నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచించారు.

             
ఇప్పుడు కేంద్ర‌ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన చండీగ‌ఢ్‌ ప్రాంతీయ ఔట్రీచ్ బ్యూరో అధికారులు కూడా ఇటువంటి ప్ర‌యోగ‌మే చేశారు. పుష్ప రాజ్ మాస్క్ పెట్టుకున్న‌ట్లు ఓ ఫొటోను రూపొందించి అంద‌రూ ఇలా క‌రోనా నిబంధ‌న‌ల‌ను పాటించాల‌ని సూచించారు. వ్యాక్సిన్లు వేసుకోవాల‌ని, వేసుకున్నాక కూడా మాస్కు 'తీసేదే లే' అని 'పుష్ప' రాజ్ చెబుతున్న‌ట్లు వారు పేర్కొన్నారు.

Go Back to Shorts
Pushpa
Tollywood

More Telugu News