Ntr: విజయనగరం నేపథ్యంలో ఎన్టీఆర్ మూవీ!

  • విడుదలకు సిద్ధమైన 'ఆర్ ఆర్ ఆర్'
  • పట్టాలపైకి వెళుతున్న కొరటాల సినిమా  
  • సుకుమార్ ద్వారా బుచ్చిబాబు ప్రాజెక్టులో కదలిక
  • ఎన్టీఆర్ ను కొత్తగా చూపించనున్న బుచ్చిబాబు  
Ntr in Buchibabu movie

ఎన్టీఆర్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఆర్ ఆర్ ఆర్' రెడీ అవుతోంది. ఆ తరువాత సినిమాను ఆయన 'కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో కథానాయికగా రష్మిక .. కీర్తి సురేశ్ పేర్లు వినిపిస్తున్నాయి. ఎవరిని ఎంపిక చేస్తారనేది తెలియాల్సి ఉంది.

అసలు ఈ పాటికే ఈ ప్రాజెక్టు మొదలుకావలసి ఉంది. కానీ కరోనా ఎఫెక్ట్ కారణంగా ప్లానింగ్ దెబ్బతింది. అందువల్లనే ఆలస్యమైంది. సాధ్యమైనంత త్వరగా సెట్స్ పైకి వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇక ఈ సినిమా తరువాత బుచ్చిబాబు దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక సినిమా చేయనున్నాడు. సుకుమార్ ద్వారా ఎన్టీఆర్ ను బుచ్చిబాబు ఒప్పించాడట. ఈ కథ అంతా కూడా విజయనగరం నేపథ్యంలో నడుస్తుందని చెబుతున్నారు. ఇంతవరకూ ఎన్టీఆర్ తెరపై కనిపిస్తూ వచ్చినదానికీ, ఇంతవరకూ ఆయన చేస్తూ వచ్చిన పాత్రలకి ఈ సినిమా పూర్తి భిన్నంగా ఉంటుందని అంటున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్.

More Telugu News