తెలంగాణలో మరో 2,707 కరోనా కేసులు... పూర్తి వివరాలు ఇవిగో!

Telangana corona statistics report
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 84,280 శాంపిల్స్ పరీక్షించగా... 2,707 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,328 కొత్త కేసులు నమోదు కాగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 248, రంగారెడ్డి జిల్లాలో 202 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో 582 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,02,801 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,78,290 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 20,462 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,049కి పెరిగింది.
Go Back to Shorts
Telangana
Corona Virus
Daily Report
Today Cases

More Telugu News