సుడిగాలి సుధీర్ హీరోగా 'గాలోడు' .. టీజర్ రిలీజ్!
- 'జబర్దస్త్' కామెడీ షోతో క్రేజ్
- హీరోగా దొరకని సక్సెస్
- మాస్ మూవీగా 'గాలోడు'
- ముఖ్య పాత్రల్లో సప్తగిరి, పృథ్వీ
ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'గాలోడు' రెడీ అవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను వదిలారు. "అదృష్టాన్ని నమ్ముకున్నవాడు కష్టాల పాలవుతాడు .. కష్టాన్ని నమ్ముకున్నవాడు అదృష్టవంతుడవుతాడు .. కానీ నేను ఈ రెండిటినీ నమ్ముకోను .. నన్ను నేను నమ్ముకుంటాను" అనే డైలాగ్ తో ఈ టీజర్ మొదలైంది.
టైటిల్ చూస్తేనే ఇది పక్కా మాస్ మూవీ అనే విషయం అర్థమవుతోంది. అందుకు తగినట్టుగానే విజువల్స్ ఉన్నాయి. మాస్ యాక్షన్ సీన్స్ పైనే ఈ టీజర్ ను కట్ చేశారు. డిఫరెంట్ లుక్ తో సుధీర్ ఈ సినిమాలో కనిపిస్తున్నాడు. ఇతర ముఖ్య పాత్రల్లో సప్తగిరి .. పృథ్వీ కనిపిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.