తెలంగాణలో కరోనా రోజువారీ కేసుల పూర్తి వివరాలు ఇవిగో!
- గత 24 గంటల్లో 38,023 కరోనా పరీక్షలు
- 235 మందికి పాజిటివ్
- జీహెచ్ఎంసీ పరిధిలో 121 కొత్త కేసులు
- ఇంకా 3,490 మందికి చికిత్స
అదే సమయంలో 204 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,81,307 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,73,793 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,490 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,024 అని తాజా బులెటిన్ లో పేర్కొన్నారు.
