ఒమిక్రాన్ దెబ్బకు 11,500 విమానాల రద్దు
- యూరప్, అమెరికాల్లో పంజా విసురుతున్న ఒమిక్రాన్
- విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం
- నిన్న ఒక్క రోజే 3 వేల విమానాల రద్దు
ఫ్లైట్ ట్రాకర్ సంస్థ ఫ్లైట్ అవేర్ వివరాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా నిన్న దాదాపు 3 వేల విమానాలు రద్దు కాగా... ఈరోజు ఇప్పటి వరకు 1,200 విమానాలు రద్దయ్యాయి. క్రిస్మస్, న్యూఇయర్ సమయంలో విమానాలు అత్యంత రద్దీగా ఉండే తరుణంలో విమాన సర్వీసులకు ఒమిక్రాన్ రూపంలో పెద్ద విఘాతం కలిగింది.