తెలంగాణలో మరో 172 మందికి కరోనా పాజిటివ్
- గత 24 గంటల్లో 39,919 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 86 కొత్త కేసులు
- రాష్ట్రంలో ఒకరి మృతి
- ఇంకా 3,625 మందికి చికిత్స
రాష్ట్రంలో ఇప్పటివరకు 6,79,892 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,72,251 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,625 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,016కి పెరిగింది.
