టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ హౌస్ అరెస్ట్!

Police house arrested Chintamaneni Prabhakar
  • పోలవరం యాత్రను చేపట్టిన టీడీపీ
  • నిర్వాసితులను పరామర్శించేందుకు వెళ్తున్న టీడీపీ నేతలు
  • ముందస్తుగా టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్న పోలీసులు
పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇంటి వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. చింతమనేనిని గృహనిర్బంధం చేశారు. టీడీపీ నేతలు ఈరోజు పోలవరం యాత్రను చేపట్టారు. పోలవరం నిర్వాసితులను పరామర్శించేందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. చింతమనేనితో పాటు నిమ్మల రామానాయుడు, పితాని, గన్ని వీరాంజనేయులు తదితరులు నిర్బంధంలో ఉన్నారు.
Go Back to Shorts
Chinthamaneni Prabhakar
Telugudesam
House Arrest

More Telugu News