తెలంగాణలో కొత్తగా 153 కరోనా కేసులు వెల్లడి
Add ap7am to your home Screen

తెలంగాణలో కొత్తగా 153 కరోనా కేసులు వెల్లడి

Telangana corona bulletin
  • గత 24 గంటల్లో 36,570 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 60 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఇద్దరి మృతి
  • ఇంకా 3,533 మందికి చికిత్స
గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 36,570 కరోనా పరీక్షలు నిర్వహించగా, 153 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 60 కొత్త కేసులు నమోదు కాగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 14, రంగారెడ్డి జిల్లాలో 12 కేసులు వెలుగుచూశాయి.

అదే సమయంలో 157 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,74,845 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,67,328 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,533 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 3,984కి పెరిగింది.
Telangana
Corona Virus
Today Cases
Media Report

More Telugu News