తెలంగాణలో మరింతగా తగ్గిన కరోనా వ్యాప్తి
- గత 24 గంటల్లో 31,514 కరోనా పరీక్షలు
- 137 మందికి పాజిటివ్
- జీహెచ్ఎంసీ పరిధిలో 54 కొత్త కేసులు
- రాష్ట్రంలో ఇద్దరి మృతి
- ఇంకా 3,538 మందికి చికిత్స
రాష్ట్రంలో ఇప్పటివరకు 6,74,692 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,67,171 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,538 మంది చికిత్స పొందుతున్నారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 3,983కి పెరిగింది.
