వైసీపీ ప్రభుత్వంపై సెటైర్లు వేసిన పవన్ కల్యాణ్

Pawan Kalyan fires on YSRCP Govt
  • ఎయిడెడ్ స్కూళ్ల పట్ల ప్రభుత్వ తీరును తప్పు పట్టిన పవన్ కల్యాణ్
  • ఒక పండ్ల వ్యాపారి స్కూల్ ని నిర్మించారన్న పవన్
  • ఏపీ ప్రభుత్వం మాత్రం ఎయిడెడ్ విద్యాసంస్థలను మూసేస్తోందని విమర్శ
ఎయిడెడ్ స్కూళ్లను ఏపీ ప్రభుత్వం విలీనం చేసుకుంటుండటంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తొలి నుంచి విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. కర్ణాటకలోని మంగళూరు ప్రాతంలో హరికేళ హజబ్బ అనే పండ్ల వ్యాపారి పాఠశాలను నిర్మించి... దేశంలోని నాలుగో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీని పొందిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని పవన్ ఉటంకిస్తూ... 'పండ్ల వ్యాపారి, పద్మశ్రీ పురస్కార గ్రహీత హరికేళ హజబ్బ తన సొంత సంపాదనతో పాఠశాలను ఎలా నిర్మించగలిగారు? ఏపీలోని వైసీపీ ప్రభుత్వం మాత్రం గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీలను మూసేస్తోంది' అంటూ విమర్శించారు.
Go Back to Shorts
Pawan Kalyan
Janasena
YSRCP
Aided Schools

More Telugu News