తెలంగాణలో కొత్తగా 153 కరోనా కేసులు నమోదు
- గత 24 గంటల్లో 36,510 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 52 మందికి పాజిటివ్
- రాష్ట్రంలో ఇద్దరి మృతి
- ఇంకా 3,737 మందికి చికిత్స
అదే సమయంలో 160 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,73,140 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,65,432 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,737 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,971కి పెరిగింది.
