తెలంగాణలో కొత్తగా 164 మందికి కరోనా పాజిటివ్

Telangana corona media update
  • గత 24 గంటల్లో 36,999 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 51 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 3,815 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 36,999 కరోనా పరీక్షలు నిర్వహించగా, 164 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 51 కొత్త కేసులు నమోదు కాగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 14, రంగారెడ్డి జిల్లాలో 12, ఖమ్మం జిల్లాలో 10 కేసులు గుర్తించారు. ములుగు, మెదక్, జోగులాంబ గద్వాల, జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 186 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,72,367 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,64,588 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,815 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,964కి పెరిగింది.
Go Back to Shorts
Telangana
Corona Virus
Media Report
Today Cases

More Telugu News