వర్థమాన నటితో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ చాటింగ్!... కోర్టుకు సమర్పించిన ఎన్సీబీ
- డ్రగ్స్ సరఫరాదారులతోనూ టచ్ లో ఉంటున్న ఆర్యన్
- ఇవాళ మధ్యాహ్నం ఆర్యన్ బెయిల్ పిటిషన్ పై విచారణ
- గతవారం తీర్పును రిజర్వ్ చేసిన స్పెషల్ కోర్టు
అంతేగాకుండా కొందరు డ్రగ్స్ సరఫరాదారులతోనూ ఆర్యన్ ఖాన్ చాట్ చేసిన మెసేజ్ లనూ ఇప్పటికే కోర్టుకు సమర్పించారు. వారితో ఆర్యన్ ఖాన్ తరచూ టచ్ లో ఉంటున్నాడని తెలిపారు. ముంబైలోని స్పెషల్ కోర్టు ఆర్యన్ బెయిల్ పిటిషన్ ను విచారిస్తోంది. గత వారం వాదనలను విన్న కోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. ప్రస్తుతం ఆర్యన్ తో పాటు అర్బాజ్ మర్చంట్, మరో ఆరుగురు ఆర్థర్ రోడ్ జైలులో ఉన్నారు. ఆ జైలులోనే నిందితులందరికీ కౌన్సిలింగ్ చేశారు.