'కొండ పొలం' చూశాను .. నాకు బాగా నచ్చింది: చిరంజీవి

Chiranjeevi apreciated Konda Polam team
షార్ట్స్‌లో చూడండి
వైష్ణవ్ తేజ్  కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో 'కొండ పొలం' సినిమా రూపొందింది. సాయిబాబు - రాజీవ్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. రకుల్ కథానాయికగా నటించిన ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. కోట - సాయిచంద్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమా ప్రీమియర్ చూసిన చిరంజీవి, వెంటనే ట్విట్టర్ ద్వారా తన స్పందనను తెలియజేశారు. 'కొండ పొలం' సినిమా ఇప్పుడే చూశాను .. నాకు చాలా బాగా నచ్చింది. పవర్ఫుల్ సందేశంతో కూడిన అందమైన గ్రామీణ ప్రేమకథ ఇది. క్రిష్ ఎప్పుడూ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ఉంటారు.

నటీనటుల నుంచి మంచి నటనను రాబట్టుకునే సత్తా ఆయనకి ఉంది. తప్పకుండా ఈ సినిమా ఎన్నో ప్రశంసలను అందుకుంటుందనీ .. ఎన్నో అవార్డులను గెలుచుకుంటుందని ఆశిస్తున్నాను" అని రాసుకొచ్చారు. ఒక సామాన్యుడిగా అడవిలో ఇబ్బందులు పడిన ఒక యువకుడు, అడవిని సంరక్షించే అధికారిగా తిరిగి రావడమే ఈ కథ.
Go Back to Shorts
Panja Vaisshnav Tej
Rakul Preet Singh
Saichand

More Telugu News